ఫిర్యాదులు పరిష్కరించాలి
బెల్లంపల్లిరూరల్: పోలీస్‌స్టేషన్‌కు వచ్చేవారి తో మర్యాదపూర్వకంగా మెదిలి ఫిర్యాదుల ను సత్వరమే పరిష్కరించాలని డీసీపీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. సోమవారం సాయంత్రం బెల్లంపల్లి మండలం తాళ్లగురిజాల పోలీస్‌స్టేషన్‌ను ఆయన బెల్లంపల్లి ఏసీపీ ఏ.రవికుమార్‌తో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. స్టేష న్ పరిసరాలు, రికార్డులు పరిశీలించారు. గ్రా మాల్లో నిరంతరం నిఘా వేసి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల ని సిబ్బందిని ఆదేశించారు. గ్రామీణులకు సీసీ కెమెరాల ప్రాముఖ్యత, గంజాయి వల్ల కలిగే అనర్థాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. బెల్లంపల్లి రూరల్ సీఐ సీహెచ్.హనోక్, తాళ్లగురిజాల ఎస్సై బి.రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.


