పోలీస్ అమరుల త్యాగాలు వెలకట్టలేనివి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): నిత్యం విధుల్లో పోలీసులతోపాటు విధి నిర్వహణలో అమరులు అవుతున్న వారి త్యాగాలు వెలకట్ట లేనివని బెటాలి యన్ కమాండెంట్ పి.వెంకటరాములు అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సోమవా రం బెటాలియన్ ఆవరణలో బైక్‌ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. గుడిపేట గ్రామ, జాతీయ రహదారులపై బైక్ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల ప్రాణరక్షణలో పోలీసులు ఏదో ఒక సందర్భంలో అమరులు అవుతున్నారని తెలిపారు. ర్యాలీలో అసిస్టెంట్ కమాండెంట్ నాగేశ్వర్‌రావు, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.


