నగరంలో దోమల మోత
అస్తవ్యస్తంగా డ్రెయినేజీ వ్యవస్థ ఇళ్ల మధ్యనే నిలుస్తున్న మురుగు నీరు పందులకు ఆవాసంగా మారుతున్న వైనం
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నగరంలో డ్రె యినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో డ్రెయినేజీల నిర్మాణం లేక మురు గు నీరు ఖాళీ స్థలాల్లోకి పారుతూ దోమలు, పందులకు ఆవాసంగా మారుతోంది. దుర్వాసన, దోమల మోతతో ప్రజలు అనారోగ్యం బారిన పడాల్సి వస్తోంది. వర్షాకాలంలో పారి శుద్ధ్యాన్ని మెరుగుపర్చకపోవడంతో మురుగునీరు ఇళ్ల మధ్యన చేరుతోంది. మంచిర్యాల మున్సిపాలిటీగా ఉన్నప్పుడు పారిశుద్ధ్యం మెరుగ్గానే ఉండేది. ఎప్పటికప్పుడు చెత్త తొలగించడం, డ్రెయినేజీ నీరు రోడ్లు, ఖాళీస్థలాల్లోకి రాకుండా చూడడంతోపాటు ఖాళీ స్థలాల్లో నిలిస్తే దోమలకు ఆవాసంగా మారకుండా ఆయిల్ బాల్స్ వేసి ఫాగింగ్ చేసేవారు. ఈ ఏడాది జనవరిలో నస్పూరు మున్సిపాలిటీతో పాటు హాజీపూర్ మండలంలోని ఎనిమిది గ్రామాలను మంచిర్యాల మున్సిపాలిటీలో విలీ నం చేసి కార్పొరేషన్‌గా మార్చారు. పరిధి పెరగడంతో కార్మికులు లేక ఉన్నవారిని కార్పొరేష న్ పరిధిలోని అన్ని ప్రాంతాలకు వినియోగిస్తున్నారు. నగర విస్తీర్ణానికి అనుగుణంగా పనులు చేపట్టాల్సి ఉండడంతోపాటు పారిశుద్ధ్య నిర్వహణను పకడ్బందీగా నిర్వహించలేక సమస్య ఏర్పడుతోందని తెలుస్తోంది. పాలకవర్గ పదవీ కాలం జనవరిలో పూర్తయింది. డివిజన్లలో తాజామాజీ ప్రజాప్రతినిధులు పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చేందుకు కృషి చేస్తున్నా కార్పొరేషన్ అధికారుల స్పందన అంతంత మాత్రంగానే ఉందని ఆరోపిస్తున్నారు. కార్పొరేషన్ ఏర్పడి పది నెలలు అవుతున్నా ఇంకా పాలన గాడిలో పడకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
డ్రెయినేజీలు నిర్మిస్తేనే...
మంచిర్యాల కార్పొరేషన్‌లో సరిపడా పారిశుద్ధ్య కార్మికులు లేకపోవడం సమస్యగా మారుతోంది. నగరంలో 463 కిలోమీటర్ల మేర డ్రెయినేజీ వ్యవస్థ ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 273 కిలోమీటర్లు మాత్రమే నిర్మించారు. మిగతా 190 కిలోమీటర్ల నిర్మాణం పూర్తి చేసేలోపు శివారు ప్రాంతాల్లో మరిన్ని కొత్త ఇళ్ల నిర్మాణాలు చేపడితే మరింత పెరుగుతాయి. శరవేగంగా పెరుగుతున్న నగర విస్తీర్ణానికి అనుగుణంగా డ్రెయినేజీల నిర్మాణం చేపట్టకపోవడం, పలుచోట్ల గతంలో నిర్మించిన కాలువలు శిథిలమవడం వల్ల మురుగు నీరు రోడ్లు, ఖాళీ స్థలాల్లోకి పారుతోంది. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ చేపట్టినా మురుగు నీరు రోడ్లు, ఖాళీ స్థలాల్లోకి రాకుండా ఉండేందుకు అవకాశం ఉంది. అవసరం మేరకు తాత్కాలికంగా కార్మికులను నియమించుకుని పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుస్తూనే అవసరమైన చోట డ్రెయినేజీలు నిర్మిస్తే నగరం పరిశుభ్రంగా ఉండేందుకు అవకాశం ఉంది.
మురుగు నీరు నిల్వ లేకుండా చూస్తాం
నగరంలో అవసరమైన చోట డ్రెయినేజీల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశాం. కొన్ని చోట్ల డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం, డ్రెయినేజీల నిర్మాణ పనులు చేపట్టని చోట మురుగు నీరు రోడ్లు, ఖాళీ స్థలాల్లోకి వస్తోంది. మురుగు నీరు బయటకు రాకుండా, దోమలు వృద్ధి చెందకుండా చర్యలు తీసుకుంటున్నాం. రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాని కి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. అనుమతి రాగానే నిర్మాణ పనులు చేపడతాం.
– సంపత్‌కుమార్, కమిషనర్, మంచిర్యాల కార్పొరేషన్
నగరంలో దోమల మోత


