సమస్యలు పరిష్కరించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్‌రావుతో కలిసి అర్జీలు స్వీకరించారు. జిల్లా కేంద్రం హమాలీవాడ, సూర్యనగర్ కాలనీ వాసులు గత కొద్దిరోజులుగా నల్లానీళ్లు రావడం లేదని ఫిర్యాదు చేశారు. బెల్లంపల్లి మండల కేంద్రానికి చెందిన జే.బాలక్క, ఎస్సీ కాలానికి చెందిన ఎన్.లక్ష్మి, భూపెల్లి లావణ్య ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. నెన్నెల మండలం నందులపల్లి గ్రామానికి చెందిన ఇందూరి కిష్టయ్య తన కుమారుడు భూములు లాక్కొని ఇంటి నుంచి వెళ్లగొట్టాడని, న్యాయం చే యాలని ఫిర్యాదు చేశారు. పలువురు పింఛన్ల కో సం వినతిపత్రాలు అందజేశారు. జిల్లాలో జ్యోతి రావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలు ఏర్పా టు చేయాలని యుగంధర్, సాయి, సంధ్యారాణి, నరేష్, కుమారస్వామి కోరారు. కొత్తగా ఇంటి నిర్మాణం చేపడుతున్నామని, తమ స్థలం పై నుంచి ఉన్న విద్యుత్ తీగలు తొలగించాలని భీమారం మండలం దాంపూర్ గ్రామానికి చెందిన పద్మ కోరింది.


