ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య
ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం రాత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణంలోని రిక్షా కాలనీకి చెందిన శ్రీరాముల శ్రీకాంత్(44) పంచాయతీరాజ్ శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఈయనకు భార్య వాణిశ్రీ, కూతురు శ్లోక ఉన్నారు. గతకొంత కాలంగా భార్య అనారోగ్యం బారిన పడింది. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. మనస్తాపానికి గురైన శ్రీఖాంత్ ఈ నెల 19న మావల ప్రాంతంలో పురుగుల మందు తాగి ఇంటికి వచ్చాడు. కుటుంబీకులు పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం ఈ నెల 20న హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత కోరుట్లలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. కాగా ఈయన గతంలో మాజీ మంత్రి జోగు రామన్న వద్ద పీఏగా పనిచేశారు.


