రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో కాంస్య పతకం
బెల్లంపల్లి: యాదాద్రి భువనగిరిలో ఈ నెల 24 నుంచి 26వరకు స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్(ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు క్రీడాకారులు సత్తా చాటారు. సీఎస్‌ఎన్‌ఆర్ గౌడ్ జూనియర్ కళాశాలలో అండర్–19 విభాగంలో ప్రతిభ చూపి కాంస్య పతకం గెలుచుకున్నారు. క్రీడాకారులను సోమవారం కాసిపేట సంక్షేమ బాలుర గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ సంతోష్‌కుమార్, ఎస్‌జీఎఫ్ అండర్–19 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సెక్రెటరీ బాబురావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పీడీ హరీష్, సంక్షేమ గురుకుల వైస్ ప్రిన్సిపాల్ ఎస్.రమేష్, పీఈటీలు అల్లూరి వామన్, రాజేందర్ పాల్గొన్నారు.


