 
															‘ప్రజల భద్రత కోసమే పోలీసులు’
మంచిర్యాలక్రైం: పోలీసులున్నది ప్రజల భద్రత కోసమేనని డీసీపీ ఎగ్గడి భాస్కర్ పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని శనివారం జిల్లా కేంద్రంలోని ఎం కన్వెన్షన్‌హాల్‌లో రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు ఇండియన్ రెడ్ క్రాస్‌సొసైటీ సహకారంతో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. జి ల్లాకు చెందిన యువత, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, ఆటో డ్రైవర్లు, పొలీస్ అధికారులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా డీసీపీ అమరులైన పోలీసుల త్యాగాలను కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని దా నాల కన్నా రక్తదానం చాలా విలువైందని తెలిపా రు. ఇటీవల నిజామాబాద్ జిల్లాలో రౌడీషీటర్ రి యాజ్ చేతిలో సీసీఎస్ కానిస్టేబుల్ హత్యకు గురి కావడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా 172 యూనిట్ల రక్తం సేకరించగా రక్తదాతలను అభినందించి సర్టిఫికెట్లు అందజేశారు. ఏసీపీ ప్రకాశ్, సీఐలు ప్రమోద్‌రావ్, రమణమూర్తి, మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ నరేశ్‌కుమార్, ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ, రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులు సత్యపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
