 
															తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలి
పాతమంచిర్యాల: 42శాతం బీసీ రిజర్వేషన్ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్‌లో చేర్చాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ కోరారు. జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కులో నాయకులతో కలిసి శనివారం నిరసన దీక్ష చేపట్టారు. కార్యక్రమంలో జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి సీనియర్ నాయకులు కర్ణ శ్రీధర్, గజెల్లి వెంకటయ్య, శాఖపురి భీంసేన్, పంపరి వేణుగోపాల్, గంగపుత్ర సంఘం జిల్లా అధ్యక్షుడు నెన్నెల నర్సయ్య, పద్మశాలీ సంఘం జిల్లా అధ్యక్షుడు చెలగాని సుదర్శన్, షెట్‌పల్లి గట్టయ్య, చెలిమెల అంజయ్య, కీర్తి భిక్షపతి, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
నేడు సామూహిక వివాహాలు
బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపల్ శివారులోని శివాలయంలో ఆదివారం సామూహిక వివా హాలను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి తిలక్ వాకర్స్, వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. దాతల సహకారంతో నిరుపేద యువతి, యువకులకు వివాహాలు చేయడానికి నిర్వాహకులు ముందుకొచ్చారు. ఉదయం 11.29గంటలకు వివాహ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నా రు. కార్యక్రజుమానికి హాజరయ్యే వధూవరులకు పుస్తెలు, మట్టెలు, నూతన వస్త్రాలు అందజేస్తారు. అలాగే వివాహానికి వధూవరుల తరఫున హాజరయ్యే ప్రజలకు భోజన సౌకర్యం కల్పించడానికి ఏర్పాట్లు చేశారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
