 
															చేపలు పడుతుండగా మూర్చ
కుంటాల: సరదాగా చేపల వేటకు వెళ్లిన యువకుడు మూర్చ రావడంతో నీటిలో పడి మృతి చెందిన ఘటన మండలంలోని కల్లూరులో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన సునీల్ (22), నీలేష్‌లు కల్లూరు వాగు చెక్‌డ్యాం వద్ద చేపలు పట్టేందుకు వెళ్లారు. సునీల్ చేపలు పట్టే క్రమంలో ఒక్కసారిగా మూర్చ వ్యాధి రావడంతో నీటిలో పడి మునిగిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన నీలేష్ కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆయన వెంటనే గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. 108 సిబ్బంది వచ్చి సునీల్‌ను పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడి అన్న దమ్మపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై జీవన్ రావు తెలిపారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
