 
															‘ఎస్‌ఏఈ ఇండియా’ క్లబ్ ప్రారంభం
బాసర: ఆర్జీయూకేటీలో ఎస్‌ఏఈ ఇండియా కాలేజియేట్ క్లబ్‌ను శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిలుగా లార్వెన్ ఏఐ సహ వ్యవస్థాపకులు వైఘారెడ్డి, వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం యూనివర్సిటీలో ఆటోమేటివ్ ఇంజనీరింగ్ కార్యకలాపాలకు ఒక మైలురాయన్నారు. సాంకేతిక పోటీలలో, పరిశ్రమ ఆధారిత అభ్యాసంలో విద్యార్థులను ప్రోత్సహించడమే దీని ఉద్దేశమని తెలిపారు. ఫ్యాకల్టీ సలహాదారు రాహుల్ మాట్లాడుతూ ఆర్జీయూకేటీ బాసరలో ఔత్సాహిక ఇంజనీర్లకు ఎస్‌ఏఈ భాగస్వామ్యం ద్వారా లభించే విద్యా, ఉపాధి అవకాశాలు వివరించారు. డీన్స్ డాక్టర్ కే. మహేశ్, డాక్టర్ విఠల్, ఎస్. శేఖర్, చరణ్ రెడ్డి, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
