 
															2న స్కాలర్‌షిప్ పరీక్ష
విద్యానగర్(కరీంనగర్): పేద విద్యార్థులకు ఫీజు రాయితీతో కూడిన కార్పొరేట్ విద్య అందించేందుకు నవంబర్ 2న స్కాలర్‌షిప్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ ఎం.రమేశ్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు కరీంనగర్‌లోని శ్రీచైతన్య కళాశాలలో శనివారం పోస్టర్ ఆవిష్కరించారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రతిభ ఆధారంగా వందశాతం ఫీజు రాయితీతో కూడిన విద్య అందించేందుకు పరీక్ష నిర్వహిస్తున్నట్లు పే ర్కొన్నారు. రిజిస్ట్రేషన్ వివరాలకు 9848587584, 9912349038 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. పరీక్ష రాసే విద్యార్థులకు లక్కీ డ్రా నిర్వహిస్తామని తెలిపారు. మొదటి బహుమతిగా ఎల్‌ఈడీ టీవి, రెండో బహుమతిగా సైకిల్, మూడో బహుమతిగా సెల్‌ఫోన్ అందిస్తామని పేర్కొన్నారు. ఇందులో కళాశాల డైరెక్టర్ కర్ర నరేందర్‌రెడ్డి, జూనియర్ కళాశాలల డీన్ జగన్ మోహన్‌రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
