మార్కెట్ రోడ్డులో ఇష్టారీతిన పార్కింగ్
మంచిర్యాలటౌన్: నగరంలోని మార్కెట్ రోడ్డును 60 ఫీట్లకు పెంచేందుకు ఇటీవల ఆక్రమణలను తొలగించి, వాహనాలను రోడ్డు మధ్యలో నిలుపకుండా ఆయా దుకాణాల ఎదుట పార్కింగ్ చేసేలా నిబంధనలు మార్చారు. రోడ్డు వెడల్పు పనుల్లో జాప్యం కావడం, మంచిర్యాల ఎమ్మెల్యే అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో వాహనాలు ఇష్టారీతిన పార్కింగ్ చేస్తున్నారు. ఇటీవల దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ట్రాఫిక్ జామ్‌తో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. విషయం ఎమ్మెల్యే దృష్టికి వెళ్లడంతో ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలని పోలీసులను, దుకాణదారులు రోడ్లపైకి రాకుండా చూడాలని కార్పొరేషన్ అధికారులను ఫోన్‌లో ఆదేశించారు.


