భూ ఆక్రమణదారులపై చర్యలు తప్పవు
నస్పూర్: మండల పరిధిలోని ప్రభుత్వ భూ ములను ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని తహసీల్దార్ సంతోష్ హెచ్చరించా రు. గు రువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయ న మాట్లాడుతూ ఇటీవల ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాల ఆధారంగా నస్పూర్ శివారులో ని సర్వే నంబర్ 42, 43 మధ్య వి వాదానికి సంబందించి రీ సర్వే కోసం మంచి ర్యాల ఏడీకి లేఖరాసి సర్వే ప్రారంభించామన్నారు. 42 సర్వే నంబర్‌లో గ్రంథాలయం, తహసీల్దార్, ఐటీ కార్యాలయానికి కేటాయించిన స్థలంలో వెలిసిన అక్రమ నిర్మాణాలు తొలగించి బోర్డులు ఏర్పాటు చేశామన్నారు.


