శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములవ్వాలి
● సీపీ అంబర్ కిషోర్ ఝా
తాండూర్: శాంతిభద్రతల పరిరక్షణలో యువత భాగస్వాములు కావాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం, కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా గురువారం తాండూర్ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. రికార్డులు పరిశీలించి స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక యువకులకు వాలీబాల్ కిట్లు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత ఉన్నత లక్ష్యాలను ఏర్పర్చుకుని వాటి సాధనకు కృషి చేయాలని సూచించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసుల సేవలు మరువలేనివన్నారు. విధి నిర్వహణలో పోలీసులు అలసత్వం ప్రదర్శించవద్దన్నారు. కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, తాండూర్ సీఐ దేవయ్య, ఎస్సైలు కిరణ్‌కుమార్, సౌజన్య, తదితరులు పాల్గొన్నారు.


