అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా
భీమిని: విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూస్తామని జిల్లా విద్యుత్‌శాఖ అధి కారి ఉత్తమ్ జాడే అన్నారు. గురువారం కన్నెపెల్లి మండలంలోని జన్కాపూర్ రైతు వేదికలో బెల్లంపల్లి రూరల్ పరిధిలోని కన్నెపెల్లి, భీమిని, వేమనపల్లి, నెన్నెల విద్యుత్ వినియోగదారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో విద్యుత్ సమస్యలను తమదృష్టికి తీసుకొ స్తే పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. విద్యుత్ తీగల కింద చెట్ల కొమ్మల తొలగింపునకు సిబ్బందికి సహకరించాలన్నారు. రైతులు పంటల రక్షణకు విద్యుత్ తీగలు అమర్చి ప్రమాదాల బారిన పడవద్దని సూచించారు. సమావేశంలో డీఈ రాజన్న, ఏడీ రవికుమార్, ఏఈ రాజనర్సు, తదితరులు పాల్గొన్నారు.


