 
															మధ్యాహ్న భోజన బిల్లులు విడుదల
లక్ష్మణచాంద: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్న ఏజెన్సీలకు గత కొద్ది నెలలుగా బిల్లులు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందిస్తున్న ఏజెన్సీలకు గ్రీన్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు బిల్లు అందజేయాలని నిర్ణయం తీసుకుంది.
బిల్లుల విడుదల..
నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేస్తున్న కార్మికులకు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు ఏప్రిల్, జూన్, జూలై నెలలకు సంబంధించిన గుడ్ల వ్యయం రూ.50,52,959 రూపాయలు, 9వ తరగతి, 10వ తరగతి విద్యార్థుల వంట నిర్వహణ ఖర్చులు కింద రూ.38,19,352 రూపాయలు, నిర్మల్ జిల్లాకు మొత్తం రూ. 88,72,311 రూపాయలు విడుదలయ్యాయని జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. భోజన సహాయకులుగా పని చేస్తున్న కార్మికులకు గౌరవ వేతనాలు మాత్రం విడుదల చేయలేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న మధ్యాహ్న భోజన పథకం సహాయకులు నిరాశలో ఉన్నారు. ప్రభుత్వం స్పందించి గౌరవ వేతనాలు చేయాలని కోరుతున్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
