 
															రియల్ ఎస్టేట్ వ్యాపారి అరెస్టు
వరంగల్ క్రైం: తక్కువ ధరలకే భూములు ఇప్పిస్తానని బాధితులకు మాయమాటలు చెప్పి సుమారు రూ.కోటి వరకు వసూలు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారిని అరెస్టు చేసినట్లు హనుమకొండ ఇన్‌స్పెక్టర్ మచ్చ శివకుమార్ తెలిపారు. గురువారం పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా నస్పూర్‌కు చెందిన రామిడి సంపత్‌రెడ్డి 2021లో తాను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని, తక్కువ ధరలకే భూములు ఇప్పిస్తానని పలువురికి మాయమాటలు చెప్పి వారి నుంచి సుమారు రూ.కోటి వసూలు చేశాడు. అనంతరం ఎలాంటి భూములు చూపెట్టకుండా వాయిదా వేస్తూ మోసం చేశాడు. దీంతో బాధితులు ఈ జనవరిలో హనుమకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. సంవత్సరం నుంచి పరారీలో ఉన్న సంపత్‌రెడ్డిని గురువారం హనుమకొండ బస్టాండ్ వద్ద పట్టుకుని విచారించగా.. బాధితుల నుంచి తీసుకున్న రూ.కోటితో ఆన్‌లైన్ గేమ్ ఆడానని, అంతా పోగొట్టుకున్నానని తెలిపాడు. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
