 
															అట్టహాసంగా ఫెన్సింగ్ పోటీలు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడిపేట మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం అండర్– 14 బాల, బాలికల విభాగంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాస్థాయి ఫెన్సింగ్ పోటీలు నిర్వహించారు. పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ నాగజ్యోతి, ఫెన్సింగ్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవునూరి మహేశ్, పీడీ వంగళ సురేశ్, సంయుక్త కార్యదర్శి భీమిని రాజేశ్‌ల చేతుల మీదుగా పోటీలు ప్రారంభించారు. మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. సీనియర్ క్రీడాకారులు ఆవునూరి సురేశ్, గుజ్జుల చందులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. జిల్లా స్థాయిలో ఎంపికై న ఫెన్సింగ్ క్రీడాకారులు ఈనెల 25, 26న హైదరాబాద్‌లో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులు..
గుడిపేట ఎంజేపీ విద్యార్థులు ఏ.రిత్విక్, జి.అభిలాశ్, ఏ.శశికుమార్, ఏ.రక్షిత్, బి.హర్షిత్, ఎం.నిశ్వంత్, జి.అశ్విత్, ఎస్.భానుతేజలు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఎంపికయ్యారు. వీరిని ఎంజేపీ ప్రిన్సిపాల్ సేరు శ్రీధర్, ఉపాధ్యాయులు అభినందించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
