 
															ఫుట్‌బాల్ పోటీల్లో కాసిపేట–1 విజయం
మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలోని సింగరేణి హైస్కూల్ మైదానంలో గురువారం డబ్ల్యూపీఎస్, జీఏ ఆధ్వర్యంలో ఏరియాస్థాయి ఫుట్‌బాల్ పోటీలను నిర్వహించారు., ఏరియా జీఎం రాధాకృష్ణ క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు. ఈ పోటీల్లో కాసిపేట– 1, కేకే జట్లు తలపడగా కాసిపేట –1 గ్రూపు జట్టు విజయం సాధించింది. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మంజిత్ ఫుట్‌బాల్ క్రీడాకారుడి మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. కార్యక్రమంలో డబ్ల్యూపీఎస్, జీఏ గౌరవ కార్యదర్శి కార్తీక్, కోఆర్డినేటర్ శివకృష్ణ, జనరల్ కెప్టెన్ శ్రీను, క్రీడాకారులు పాల్గొన్నారు.
అడవులపై అవగాహన
జన్నారం: జన్నారం అటవీ డివిజన్ ఇందన్‌పల్లి రేంజ్‌లో మైసమ్మకుంట, ఘనిషెట్టి కుంట ప్రాంతాలపై ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులకు హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ ఆఫ్ సొసైటీ కోఆర్డినేటర్ వెంకట్ అవగాహన కల్పించారు. అడవిలోని వృక్ష జాతులు, శీలింద్రాలు, జంతువుల గురించి వివరించారు. బైపీసీకి చెందిన 40 మంది విద్యార్థులు ఈ పర్యాటనకు వెళ్లారు. కార్యక్రమంలో అధ్యాపకులు దేవేందర్‌గౌడ్, స్వరూప, కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
