 
															సీపీని కలిసిన రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులు
పాతమంచిర్యాల: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ మంచిర్యాల శాఖ సభ్యులు బుధవారం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్‌ఝాను కలిశారు. పోలీస్ అమర వీరుల సంస్మరణ కార్యక్రమాల సందర్భంగా విధినిర్వహణలో అమరులైన వీర జవాన్ల కు సంతాపం తెలిపారు. సంస్మరణ కార్యక్రమాల్లో భాగంగా జిల్లాలో రక్తదాన శిబిరాలు నిర్వహించాల ని వినతిపత్రం సమర్పించారు. అనంతరం శాలు వాతో సన్మానించారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ కే.భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రక్తనిధి కేంద్రం ఇంచార్జీ వి.మధుసూదన్‌రెడ్డి, జిల్లా కోశాధికారి కే.సత్యపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
