 
															సమస్యల పరిష్కారమెప్పుడో..!
క్రమబద్ధీకరణ చేపట్టాలని సీఆర్పీల డిమాండ్ మినిమం టైం స్కేల్ అమలుకు విన్నపం వేతన పెంపు లేక ఇబ్బందులు
నేరడిగొండ: స్వరాష్ట్రం వచ్చిందంటే తమ జీవితాలు మారుతాయని ఆశించిన సర్వశిక్షా అభియాన్ కాంట్రాక్ట్ ఉద్యోగులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ప్రతీరోజు పాఠశాలల పర్యవేక్షణ, డేటా సేకరణ, కాంప్లెక్స్ సమావేశాల నిర్వహణ, బడిబయటి పిల్లల చేర్పు వంటి పనులతో నిత్యం విధుల్లో బిజీగా ఉంటున్నారు. అయినా చాలీచాలని వేతనాలతో నెట్టుకొస్తున్నామని, వేతన పెంపు గానీ, క్రమబద్ధీకరణ గానీ దక్కకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్లస్టర్ రిసోర్స్ పర్సన్(సీఆర్పీ)లు గత 15 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల నాణ్యతాభివృద్ధికి కృషి చేస్తున్నారు. కానీ ఇప్పటికీ కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే కొనసాగుతున్నారు. వీరికి ఇంక్రిమెంట్, మినిమం టైం స్కేల్ అమలు కాని పరిస్థితి నెలకొంది. దీంతో కుటుంబ పోషణ భారమవుతుందని సీఆర్పీలు వాపోతున్నారు. ప్రతీరోజు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించడంతో పాటు ఎంఈవోలకు నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ సమాచారాన్ని నమోదు చేయడం, ఏకోపాధ్యాయులు గైర్హాజరైతే వారు బోధన బాధ్యతలు నిర్వర్తించడం వంటి బాధ్యతలు వీరిపైనే ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల పునాది బలపర్చడం కోసం పని చేస్తున్నప్పటికీ తమ బతుకులు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని సీఆర్పీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఆర్పీలు ఖాళీలు ఉన్న చోట ఆ పనులు సైతం ఉన్నవారే చేపట్టాల్సి వస్తోంది. దీంతో అదనపు పనిభారం పడుతుందని వాపోతున్నారు.
వీరి ప్రధాన డిమాండ్లు..
ఉమ్మడి జిల్లాలో సీఆర్పీల వివరాలు..
జిల్లా స్కూల్ కాంప్లెక్స్‌లు సీఆర్పీలు ఖాళీలు
ఆదిలాబాద్ 71 58 13
మంచిర్యాల 51 43 8
నిర్మల్ 48 43 5
కుమురంభీం 67 55 12

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
