 
															గిరిజన హాస్టల్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి
ఆదిలాబాద్‌రూరల్: గిరిజన హాస్టల్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ వేతనాలు చెల్లించాలని, బెస్ట్ అవైలబుల్ ఫీజు బకాయిలు చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే జులకంటి రంగారెడ్డి, టీఏజీ సంఘం రాష్ట్ర కార్యదర్శి పూసం సచిన్‌లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈమేరకు బుధవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రిని కలిశారు. వారు మాట్లాడుతూ 43 రోజులుగా వర్కర్లు సమ్మెలో ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. హాస్టల్ డైలీవేజ్, అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్లు మధు, పాపారావు, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు, ఎస్‌ఎఫ్‌ఏ రాష్ట్ర అధ్యక్షుడు రజినీకాంత్ తదితరులు ఉన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
