 
															హోటల్‌లో అగ్ని ప్రమాదం
నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలోని ఈద్గాం ప్రాంతంలో గల నక్ష త్ర హోటల్లో బుధవారం షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం సంభవించింది. హోటల్‌లో మధ్యాహ్న సమయంలో షార్ట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన హోటల్ సిబ్బంది వెంటనే ఫైర్ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైర్ అధికారులు, సిబ్బంది మంటలు ఆర్పివేశారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, రూ.9 లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్లు ఫైర్ అధికారి ప్రభాకర్ తెలిపారు. వెంటనే మంటలను ఆర్పివేయడంతో రూ.2 కోట్ల మేర ఆస్తినష్టం జరగకుండా రక్షించినట్లు పేర్కొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
