 
															ఘాట్‌ల వద్ద రక్షణ కరువు
జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు రావడంతో నది నిండుకుండను
తలపిస్తోంది. అమ్మవారి దర్శనానికి ముందు భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. అయితే పుష్కరఘాట్ల వద్ద పోలీసు భద్రత ఉన్నప్పటికీ భక్తులు నీటి లోపలకు వెళ్లకుండా రక్షణ చర్యలు చేపట్టలేదు. ఘాట్‌ల చుట్టూ జాలీలు నిర్మించడంతో పాటు గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. – బాసర

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
