 
															● బ్లేడ్‌తో కోసుకున్న యువకుడు ● తాళ్లతో బంధించిన స్థాని
నిర్మల్‌లో సైకో వీరంగం
నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలో ఓ సైకో వీరంగం సృష్టించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానికులు, పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక బర్కత్పురా కాలనీకి చెందిన మొహమ్మద్ అన్వర్ పాత మార్కెట్‌లోని టెంట్ హౌస్‌లో పనిచేస్తున్నాడు. టెంట్ హౌస్ ఆటోను మంగళవారం రాత్రి యజమానికి చెప్పకుండా తీసుకెళ్లాడు. దీంతో యజమాని బైక్‌పై వచ్చి స్థానిక నగ్రేశ్వర వాడ చౌరస్తాలో ఆటోను ఆపి అన్వర్‌ను మందలించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అటువైపు వచ్చిన కానిస్టేబుల్ రెహమాన్ గొడవపై ఆరా తీశారు. దీంతో అన్వర్ తన మీద ఉన్న బట్టలు చింపుకొని బ్లేడుతో శరీరంపై కోసుకున్నాడు. ఈ క్రమంలో అక్కడున్న వారు అన్వర్‌ను పట్టుకొని తాళ్లతో బంధించారు. అప్పటికే అన్వర్ తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు వెంటనే చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న నిర్మల్ ఏఎస్పీ రాజేశ్ మీనా ఆసుపత్రికి చేరుకున్నారు. అన్వర్‌తో మాట్లాడే ప్రయత్నం చేయగా పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడు. దీంతో అన్వర్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
