
జీరో విద్యుత్ ప్రమాదాలే లక్ష్యం
● ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ మధుసూదన్
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో జీరో విద్యుత్ ప్రమాదాలే లక్ష్యంగా పనిచేయాలని, నిరంతర విద్యుత్ సరఫరా అందించాలని ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ మధుసూదన్ అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాల్లో క్షేత్రస్థాయిలో సిబ్బంది అందుబాటులో ఉండి ప్రమాదా లను నివారించాలని సూచించారు. పల్లెబాట, పొలంబాట, పట్నంబాట నిర్వహించి విద్యుత్ ప్రమాదాలపై వినియోగదారులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రమాదకరంగా, శిథిలావస్థలో ఉన్న స్తంభాలు, లూస్‌లైన్లు, వంగిన పోల్స్, ఎత్తు తక్కువ, పిచ్చిమొక్కలతో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను గుర్తించి సరిచేయాలన్నారు. సీఈ ఆపరేషన్ అశోక్, ఎస్‌ఈ ఉత్తం జాడే, డీఈ ఎంఎం ఖైసర్, బెల్లంపల్లి డీఈ రాజన్న, ఎస్‌ఏవో రాజేశం, ఏడీఈలు, ఏఈలు, సబ్ ఇంజినీర్లు పాల్గొన్నారు.