
పంట పొలాల్లోకి మొసళ్లు..
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నంనూర్ శివారు గోదావరినది తీర ప్రాంతాల్లోని పొలా ల్లో మొసలి పిల్లలు తిరుగాడుతున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్‌లో ఇప్పటికే మొసళ్లు ఉన్నట్లు ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. ఇటీవల ఓ మత్స్యకారుడి వలకు చిక్కిన మొస లి పిల్లను అటవీ అధికారులు బ్యాక్ వాటర్‌లో వదిలారు. రెండు రోజులుగా నంనూరు శివారులోని పొలాల్లో రైతులకు మొసలి పిల్లలు కనిపిస్తుండడంతో వాటిని జాగ్రత్తగా నీళ్లలోకి వెళ్లేలా చూస్తున్నారు.