
గూడెంలో ముగిసిన పవిత్రోత్సవాలు
దండేపల్లి: జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన మండలంలోని గూడెం శ్రీ సత్యనారాయణస్వామి ఆలయంలో ఈ నెల 5న ప్రారంభమైన పవిత్రోత్సవాలు గురువారం ముగిశాయి. చివరిరోజు మహాపూర్ణాహుతి, పవిత్ర అవరోహణము, స్నపణ తిరుమంజనము, కుంభ ప్రోక్షణ, హా రతి, మంత్రపుష్పము, మహాదాశీర్వచనము, తీర్థ ప్రసాద వితరణ కనుల పండువగా నిర్వహించారు. కార్యక్రమంలో యాజ్ఞికులు అభిరా మ చార్యులు, ప్రధాన అర్చకులు రఘుస్వామి, వేదపండితులు నారాయణశర్మ, భరత్‌శర్మ, అర్చకులు సంపత్‌స్వామి, సురేష్‌స్వామి, ఆల య ఈవో శ్రీనివాస్, సిబ్బంది చంద్రశేఖర్, సత్యనారాయణ, తిరుపతి పాల్గొన్నారు.