
చేనేత కార్మికుడికి రాష్ట్రస్థాయి పురస్కారం
నెన్నెల: మండలంలోని కుశ్నపల్లి గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు లిక్కి శంకరయ్యకు రాష్ట్రస్థాయి ఉత్తమ పురస్కారం దక్కింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ పేరిట అందించే అవార్డును రాష్ట్రమంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, పట్టు పరిశ్రమల కమిషనర్ శైలజా రామయ్యార్ చేతుల మీదుగా అందుకున్నారు. రూ.25 వేల నగదుతో పాటు ప్రశంసాపత్రం అందజేశారు. కళా నైపుణ్యంతో మగ్గంపై టస్సర్ పట్టువస్త్రం తయారు చేస్తూ చేనేత సంస్కృతిని ఇప్పటికీ కాపాడుతున్నందుకు గానూ శంకరయ్యకు ఈ గౌరవం దక్కింది.