
కూతుర్ని స్కూల్‌కు పంపించేందుకు వెళ్తూ...
● బైక్ అదుపుతప్పి వంతెన పైనుంచి పడి తండ్రి మృతి ● కూతురుకు తీవ్రగాయాలు
భైంసారూరల్: కూతుర్ని స్కూల్‌కు పంపించేందుకు బైక్‌పై వెళ్తూ వంతెన పైనుంచి కిందపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై శంకర్ తెలిపిన వివరాల మేరకు.. కుభీర్‌కు చెందిన రిటైర్డ్ ఆర్మీ దొంతుల గణేశ్ (43) కుమార్తె నిఖిల హైదరాబాద్‌లోని చైతన్య పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. సోమవారం తెల్లవారుజామున 4:50 గంటలకు బాసర నుంచి అజంతా ఎక్స్‌ప్రెస్ రైలులో హైదరాబాద్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. తెల్లవారుజామున కూతుర్ని బైక్‌పై ఎక్కించుకుని బాసరకు బయలుదేరాడు. దేగాం వద్ద 161బీబీ హైవే నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. హైవేపై ఎలాంటి హెచ్చరిక బోర్డులు, లైట్లు లేక పోవడంతో బైక్ అదుపుతప్పి వంతెన పైనుంచి కిందపడింది. ఘటనలో గణేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. నిఖిలకు తీవ్రగాయాలు కావడంతో 108లో భైంసాలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. నిర్లక్ష్యం ప్రదర్శించి పలువురి మృత్యువాతకు కారణమవుతున్న హైవే కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

కూతుర్ని స్కూల్‌కు పంపించేందుకు వెళ్తూ...