
బాసరలో మాస్టర్ ప్లాన్ అమలు
● త్వరలోనే పరిశీలన, ఆలయ అభివృద్ధి ● వైఎస్సార్ హయాంలో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు ● ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ● బాసరలో ప్రత్యేక పూజలు
బాసర: అనేక సంవత్సరాలుగా బాసర ఆలయానికి సంబంధించిన మాస్టర్‌ప్లాన్ పెండింగ్‌లో ఉందని, త్వరలోనే పరిశీలిస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ప్రభుత్వ పెద్దలు, బ్రాహ్మణోత్తముల ద్వారా మాస్టర్‌ప్లాన్ అమలు చేసి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించా రు. నిర్మల్ జిల్లా బాసర సరస్వతీ ఆలయాన్ని శుక్రవారం ఆయన కుటుంబ సమేతంగా సందర్శించి అ మ్మవారిని దర్శించుకున్నారు. మొదటిసారి ఆలయానికి వచ్చిన మంత్రికి ఆలయ వైదిక బృందం సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అ నంతరం కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ఆలయ స్థానాచార్యుడు ప్రవీణ్‌పాఠక్ అమ్మవారి హారతి, తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. మంత్రి శ్రీధర్‌బాబు విలేకరుల సమావేశంలో మా ట్లాడుతూ.. తన సోదరి, కుటుంబ సభ్యులతో సరస్వతి అమ్మవారిని దర్శించుకోవడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బాసరలో చ దువుల తల్లి ఉంది కాబట్టే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. ఆల య అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో ఉందని తెలిపారు. ప్రత్యేకంగా మొన్ననే దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి వివేక్‌ను బాసరకు పంపించిందని తెలిపారు. మంత్రి శ్రీధర్‌బాబును క లెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీ షర్మిల, భైంసా ఏఎస్పీ అవినాశ్‌కుమార్ కలిశారు. ట్రిపుల్ ఐటీ వసతి గృహంలో కలెక్టర్ అభిలాష అభినవ్‌తో జిల్లా అభివృద్ధిపై మంత్రి చర్చించారు. పలు సమస్యలపై వివరాలు తెలుసుకున్నారు. శాంతిభద్రతల గురించి ఎస్పీ షర్మిలను ఆరా తీశారు. వీరి వెంట స్థానిక కాంగ్రెస్ నాయకులు, పార్టీ మండలాధ్యక్షుడు మమ్మాయి రమేశ్ తదితరులున్నారు.