
గృహహింస చట్టాలపై అవగాహన ఉండాలి
లక్సెట్టిపేట: మహిళలు గృహహింస చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి కే.సాయికిరణ్ అన్నారు. బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో లక్సెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల అంగన్‌వాడీ మహిళా సిబ్బందికి న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలపై అరాచకాలు పెరుగుతున్నాయని, మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు రూపొందించిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఇబ్బందులు పడితే అంగన్‌వాడీ సిబ్బంది అవగాహన కల్పించాలని తెలిపారు. మహిళల రక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్తన్న, కార్యదర్శి ప్రదీప్, ఏజీపీ సత్యం, న్యాయవాదులు సురేందర్, శ్రీధర్, పద్మ, సత్యనారాయణ, ఎంపీడీవో సరోజ, సీడీపీవో రేష్మ తదితరులు పాల్గొన్నారు.