
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
కాసిపేట: విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని బెల్లంపల్లి న్యాయస్థానం జూనియర్ సివిల్ జడ్జి ముకేష్ అన్నారు. బుధవారం మండలంలోని దేవాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో జడ్జి తనిఖీ చేశారు. విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. నాణ్యమైన పౌష్టికాహారం అందుతుందా, పాఠాలు సక్రమంగా బోధిస్తున్నారా? పాఠశాల ఆవరణలో పరిశుభ్రత, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాల అంతా పరిశీలించి సక్రమంగా చదువుకుని ప్రయోజకులు కావాలని సూచించారు. ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా వ్యవహరించి విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ, ప్రధానకార్యదర్శి రవికుమార్, ఉపాధ్యక్షుడు అనిల్, స్పోర్ట్స్ చైర్మన్ మాసు సుధాకర్, సభ్యులు సింగతి రాజేష్, దాసారపు రాజ్‌కుమార్, జుబేర్, శ్రావణ్, సంగీత, న్యాయవాదులు పాల్గొన్నారు.
పనులు పర్యవేక్షించిన ఎస్‌ఈ
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం రాపల్లిలో కొత్తగా ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్‌స్టేషన్‌లోని 11 కేవీ బ్రేకర్ చార్జ్ పనులను జిల్లా విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజినీర్(ఎస్‌ఈ) జాడె ఉత్తమ్ బుధవారం పర్యవేక్షించారు. ఈ బ్రేకర్ చార్జ్ వల్ల మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని నర్సింగాపూర్, హాజీపూర్ మండలం ధర్మారం గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ఉంటుందని తెలిపారు. ప్రజలు విద్యుత్ సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తారని చెప్పారు. విద్యుత్ డీఈ ఎం.డీ.కై సర్, ఏడీఈ వెంకటేశ్వర్లు, ఏఈ మహేందర్‌రెడ్డి, సబ్ ఇంజినీర్ శిరీష, సిబ్బంది పాల్గొన్నారు.

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి