
గురువులను సన్మానించడం అదృష్టం
చెన్నూర్/తాండూర్: వివిధ రంగాల్లో శిక్షణ ఇస్తున్న గురువులు, కళాకారులను సన్మానించడం అదృష్టమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ అన్నారు. గురుపౌర్ణమి సందర్భంగా గురువారం చెన్నూర్ బీజేపీ కార్యాలయంలో గురువులు, కళాకారులు, తాండూర్ మండలం అచ్చలాపూర్ వేద పాఠశాలలో గురువులను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంతోమంది వేద పండితులను తయారు చేసిన వేద పాఠశాల జిల్లాలో ఉండడం గర్వకారణమని అన్నారు. తాండూర్ మండల బీజేపీ నాయకులు జెడ్పీఎస్‌ఎస్ రిటైర్డు ఉపాధ్యాయుడు ఎం.రామ్మోహన్‌ను పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమాల్లో రిటైర్డ్ వ్యాయమ ఉపాధ్యాయుడు కారెంగుల రామయ్య, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యల ఏమాజీ, జిల్లా కార్యదర్శి దుర్గం అశోక్, పట్టి కృష్ణ, చెన్నూర్ పట్టణ అధ్యక్షుడు తుమ్మ శ్రీపాల్, బత్తుల సమ్మయ్య, రాపర్తి వెంకటేశ్వర్, జాడి తిరుపతి, కేవీఏం శ్రీనివాస్, మధు,