
● ఏటేటా పెరుగుతున్న జనాభా ● అమ్మాయిల జననాలే అధికం ● క్ర
ఈ ఏడాది థీమ్..
‘‘యువతకు న్యాయమైన, ఆశాజనక ప్రపంచంలో వారు కోరుకునే కుటుంబాలను సృష్టించడానికి వారిని శక్తివంతం చేయడం’’
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కన్ను తెరిస్తే జననం.. కన్ను మూస్తే మరణం. రెప్పపాటులో పుట్టుక చావులు జరిగిపోతున్నాయి. ఏటేటా జనాభా పెరిగిపోతోంది. గతంతో పోలిస్తే జనన, మరణాల సంఖ్య పెరుగుదల రేటు తగ్గిపోతోంది. మారుతున్న పరిస్థితులు జనాభాను నియంత్రిస్తున్నాయి. అందరికీ అన్ని సౌకర్యాల కల్పన మానవ సమాజంలో క్లిష్టంగా మారింది.. శుక్రవారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. ఉమ్మడి జిల్లాలో జనాభాతోపాటు పట్టణాల్లో నివసించే వారి సంఖ్య పెరుగుతోంది. గిరిజన, మైదాన ప్రాంతాల్లో మార్పులు వస్తున్నాయి.
తగ్గుతున్న మహిళా జనాభా
ప్రతీ వెయ్యి మంది పురుషులకు మహిళల సంఖ్య తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల పలు సర్వేల్లోనూ లింగనిష్పత్తి తగ్గుతూ వస్తోంది. పురుషులకు సమానంగా సీ్త్రలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. 2011అధికారిక జనాభా లెక్కల్లోనే ఇది స్పష్టమైంది. సీ్త్ర, పురుష సమానత్వం లేకపోతే సమాజంలో అసమానతలు ఏర్పడే అవకాశం ఉంది. మరోవైపు లింగనిర్ధారణ చేస్తు ఆడశిశువులను పురిటిలోనే చంపేయడం జనాభాలో అసమతుల్యతకు కారణంగా మారుతున్నాయి.
అమ్మాయిలే పుడుతున్నారు..
‘సీఆర్‌ఎ్‌స్(రిజిస్ట్రార్ జనరల్, గణాంక కమిషనర్ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం) 2021 నివేదికలో ఉమ్మడి జిల్లాలో మొత్తం 26576మంది అబ్బాయిలు పుట్టగా, అమ్మాయిలు మాత్రం 25124మంది జన్మించారు. అదే సమయంలో మహిళల కంటే మగవారి మరణాలే ఎక్కువగా నమోదయ్యాయి. ఈ వివరాల ప్రకారం 10,455మంది పురుషులు చనిపోతే, సీ్త్రలు 7,832మంది మరణించారు.
పెరుగుతున్న వలసలు..
గ్రామాలు వదిలి విద్యా, ఉద్యోగ, ఉపాధి సౌకర్యాల కోసం అధికంగా వలసలు పెరుగుతున్నాయి. దీంతో క్రమంగా పట్టణీకరణ పెరుగుతోంది. 2011లెక్కల ప్రకారం మంచిర్యాల జిల్లా 43.8శాతం, ఆదిలాబాద్ 23.7శాతం, నిర్మల్ 21.4, కుమురంభీం జిల్లాలో 16.9శాతంతో పట్టణ జనాభా ఉంది. ప్రస్తుతం 2025నాటికి సంఖ్య మరింత పెరగనుంది. అయితే పట్టణాల్లో పెరుగుతున్న వలసలకు అనుగుణంగా శుభ్రమైన తాగు, ఉండేందుకు ఇల్లు, విద్యా, వైద్యం, ఉద్యోగ, ఉపాధి వసతలు కల్పన జరగాల్సి ఉంది. లేకపోతే అల్పాదాయంతో పేదరికంలో అధిక జనాభా మగ్గాల్సి వచ్చే ప్రమాదం ఉంది. జిల్లాలో ప్రతీ చదరపు కిలోమీటరకు జనసాంద్రత చూస్తే ఆసిఫాబాద్ జిల్లా తక్కువ ఉండగా, పట్టణీకరణ చెందిన మంచిర్యాల జిల్లాలో అధికంగా ఉంది. ప్రస్తుతం 2025 నాటికి జనసాంద్రత మరింత పెరగనుంది. వసతులు, సౌకర్యాలు అధికంగా ఉన్న ప్రాంతాలకు వలసలతో ఆ ప్రాంతాల్లో జన సాంద్రత పెరుగుతోంది.

● ఏటేటా పెరుగుతున్న జనాభా ● అమ్మాయిల జననాలే అధికం ● క్ర