
మానవ మనుగడకు మొక్కలు మేలు
చెన్నూర్: మానవ మనుగడకు మొక్కలు మేలు చేస్తాయని జూనియర్ సివిల్ జడ్జి పర్వతపు రవి అన్నారు. గురువారం అటవీ శాఖ ఆధ్వర్యంలో అటవీ అధికారులు, విద్యార్థులతో కలిసి కోర్టు ఆవరణలో వన మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవులు అంతరించి పోతే పెను ప్రమాదం సంభవిస్తుందని అన్నారు. ప్రాణవాయువునిచ్చే మొక్కలను నాటడమే కాకుండా సంరక్షించాలని తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మద్ది కార్తీక్, సీనియర్ న్యాయవాదులు రమేశ్‌చందర్ గిల్డా, మల్లేశంగౌడ్, అటవీ అధికారులు ప్రభాకర్, న్యాయవాదులు పాల్గొన్నారు.