
దొరికిన పర్సు పోలీసులకు అప్పగింత
కుభీర్: దొరికిన పర్సును పోలీసులకు అప్పగించి దొంతుల పుష్ప అనే మహిళ నిజాయితీ చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. భైంసా వెళ్లేందుకు దొంతుల పుష్ప అనే మహిళ మండల కేంద్రంలోని బస్టాండ్‌కు వచ్చారు. అక్కడ ఆమెకు ఒక పర్సు దొరికింది. అందులో రూ.24,416ల నగదు, వెండి కాళ్లగజ్జలు (ఒక జత), ఇద్దరు మహిళలు, ఒక పిల్లడి ఫొటోలు ఉన్నాయి. ఒక ఫొటోపై యువతి పేరు కవిత అని రాసి ఉంది. కాగా దొంతుల పుష్ప దొరికిన పర్సును తన భర్త దత్రాత్రితో పోలీస్‌స్టేషన్‌కు పంపించి తన నిజాయితీ చాటుకున్నారు. భర్త పర్సును ఎస్సై కృష్ణారెడ్డికి అప్పగించారు. డబ్బు పోగొట్టుకున్న వారు సరైన ఆధారాలు చూపి డబ్బు తీసుకుపోవచ్చని ఎస్సై తెలిపారు.