
ముగిసిన పెన్కాక్ సిలాట్ శిక్షణ
నస్పూర్: స్థానిక సాధన స్పోర్ట్స్, డిఫెన్స్ అకా డమీలో నిర్వహించిన పెన్కాక్ సిలాట్ శిక్షణ శిబిరం ఆదివారం ముగిసింది. కార్యక్రమాని కి అంతర్జాతీయ క్రీడాకారుడు, తెలంగాణ రాష్ట్ర పెన్కాక్ సిలాట్ కార్యదర్శి సతీశ్‌గౌడ్ హా జరై జిల్లా క్రీడాకారులకు మెలకువలు నేర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఈ క్రీడకు సంబంధించిన సర్టిఫికెట్స్‌కు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలలో ప్రత్యేక రిజ ర్వేషన్ ఉంటుందన్నారు. రానున్న రోజుల్లో ఈ క్రీడకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు కోసం కృషి చేయాలన్నారు. ఈ శిక్షణలో సుమారు 50 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా పెన్కాక్ సిలాట్ చైర్మన్ రంగ రమేశ్, అధ్యక్షుడు పోచంపల్లి వెంకటేశ్, ప్రధాన కార్యదర్శి కొండబర్థి సందీప్, కోశాధికారి మోయిస్‌ఖాన్, ఉపాధ్యక్షుడు రంగు శ్రీనివాస్, జాయింట్ సెక్రెటరీ ఆకుతోట నరేశ్ తదితరులు పాల్గొన్నారు.