
అభివృద్ధే లక్ష్యంగా ముందుకు
● ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు
మంచిర్యాలక్రైం: మంచిర్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ రోడ్ ప్రధాన చౌరస్తాలో రూ.78 కోట్లతో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు. రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయల్లోకి వచ్చానన్నారు. తాను ఆందరిలా మాటలు చెప్పి తప్పించుకునే రకం కాదని, ఇచ్చినమాటకు కట్టుబడి పనిచేస్తానన్నారు. రోడ్డు విస్తరణపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, రానున్న రోజుల్లో దీని ఫలితాలు ప్రజలు అనుభవిస్తారని పేర్కొన్నారు. 15 రోజులో టెండర్ ప్రక్రియ పూర్తవుతుందని, డిసెంబర్31 వరకు రోడ్డు విస్తరణ పూర్తి చేయాలని తెలిపారు.