
జలదిగ్బంధంలో కామాయి గ్రామం
సాత్నాల: భోరజ్ మండలంలోని కామాయి గ్రామానికి చిరుజల్లులు పడితేనే రాకపోకలు నిలిచిపోతున్నాయి. గ్రామంలో దాదాపు 600 మంది నివసిస్తున్నారు. పెన్ గంగ నది పరీవాహక ప్రాంతంలో ఉండే ఈ గ్రామం నుంచి జిల్లా కేంద్రానికి వచ్చే రహదారిపై లోలెవల్ వంతెన ఉండటంతో చిన్నవర్షానికే బ్రిడ్జిపై నుంచి వరదనీరు ప్రవహిస్తుంది. కుడి వైపున పెన్‌గంగా, ఎడమవైపు లో లెవల్ వంతెనపై వరదనీరు పొంగిపొర్లడంతో బుధవారం సాయంత్రం వరకు గ్రామస్తులు జలదిగ్బంధంలో కూరుకుపోయారు. సాయంత్రం 7 గంటల తర్వాత బ్రిడ్జిపైన వరద నీటి ప్రవాహం తగ్గడంతో రాకపోకలు పునరుద్ధరించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.