
బాధితుడి నిర్వాకంతో అధికారుల హైరానా
కై లాస్‌నగర్: కలెక్టర్‌ను కలిసేందుకు వచ్చిన ఓ వ్యక్తి కలెక్టరేట్‌లో మూర్చ పేరిట కిందపడిపోయి అధికారులు హైరానా పడేలా చేసిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఇచ్చోడ మండలం గెర్జాం గ్రామానికి చెందిన శివాజీ అనే వ్యక్తి తన భూ సమస్యను కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్‌కు వచ్చాడు. తహసీల్దార్ చాంబర్‌లోకి వెళ్లి మూర్చపోయినట్లు కిందపడ్డారు. దీంతో తహసీల్దార్ శ్రీనివాస్‌తో పాటు కార్యాలయ ఉద్యోగులు ఆందోళన చెందారు. ఆర్డీవో వినోద్‌కుమార్ సైతం అక్కడి చేరుకున్నారు. బాధితుడు పడిపోయి ఉండడంతో వివరాలు ఆరా తీశారు. ఆ సమయంలోనే చేరుకున్న కలెక్టర్ రాజర్షిషా బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించాలని ఆదేశించారు. దీంతో కార్యాలయ సిబ్బంది 108 అంబులెన్స్‌లో రిమ్స్‌కు తరలించారు. కాగా తన భూమిని కొందరు కబ్జా చేయగా అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని మూర్చపోయినట్లు నాటకాలు ఆడినట్లు తెలుస్తోంది. సదరు వ్యక్తి ఆరోగ్య సమస్యపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.