
భూగర్భ జలాలు కాపాడుకోవాలి
లక్సెట్టిపేట: భూగర్భ జలాలను కాపాడేందుకు కృషి చేయాలని జలశక్తి అభియాన్ సైంటిస్ట్ రాంబాబు సూచించారు. మంగళవారం మండలంలోని తిమ్మాపూర్, జెండా వెంకటాపూర్, లక్ష్మీపూర్ గ్రామాలను సందర్శించి ప్రజలతో మాట్లాడారు. ఇంకుడుగుంతలతో భూగర్భ జలాలు పెరుగుతాయని తెలిపారు. ఇంటింటా ఇంకుడుగుంత నిర్మించుకోవాలని సూ చించారు. మండలంలోని గ్రామపంచాయతీలను రెండు భాగాలుగా విభజించి ప్రతీ ఇంటికి ఇంకుడుగుంత నిర్మించుకునేలా ప్రజలకు అవగాహన క ల్పించాలని ఆదేశించారు. అనంతరం ఇంకుడుగుంతల నిర్మాణ పనులు పరిశీలించారు. ఎంపీడీవో స రోజ, ప్లాంటేషన్ మేనేజర్ శ్రీనివాస్, సీడీసీఎల్ ఆర్పీ సదానందం, ఏపీవో వేణుగోపాల్, డీఆర్డీఏ సి బ్బంది సత్యనారాయణ, రాజ్‌కుమార్, మధు, ఈసీ శైలజ, పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.