లక్సెట్టిపేట: రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసిన వ్యాపారి డబ్బులు చెల్లించకుండా ఐపీ పెట్టడంతో బాధితులు మంగళవారం బీట్ బజార్‌లోని వ్యాపారి ఇంటిఎదుట ధర్నా నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. సదరు వ్యాపారి రైస్‌మి ల్లు నిర్వహిస్తూ దండేపల్లి, లక్సెట్టిపేట మండలాల్లో ని రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా కొందరి వద్ద డబ్బులు అప్పుగా తీ సుకున్నాడు. సుమారు రూ.7 కోట్లు అప్పులు కావడంతో రంగారెడ్డి జిల్లా కోర్టు నుంచి ఐపీ తీసుకుని బాధితులకు పంపించాడు. కోర్టు నోటీసు తీసుకున్న బాధితులు వ్యా పారి ఇంటి ఎదుట ధర్నాకు వచ్చి ఇట్టి ఇల్లు రైతులకు చెందినదని బోర్డు రాసి పెట్టారు. సుమారు 195 మంది బాధితులు నిరసన వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని బాధితులను పంపించారు.