సాత్నాల: భోరజ్ మండలంలోని పూసాయికి చెందిన సిల్వర్ దేవన్న మంగళవారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టా అందుకున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర విభాగంలో సోషల్ ఎకానమీ అండ్ హెల్త్ డెవలప్‌మెంట్ ఆఫ్ ప్రైమెటివ్ ట్రైబ్స్ ఎస్టడీ ఇన్ తెలంగాణ స్టేట్ అనే అంశంపై పరిశోధన చేసినందుకుగానూ ఆయన డాక్టరేట్ పట్టా అందుకున్నారు. ప్రస్తుతం దేవన్న ఉట్నూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అర్థశాస్త్ర అధ్యాపకుడిగా సేవలందిస్తున్నారు.
నిజాయతీ చాటుకున్న విజయ్
నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్‌కు చెందిన విజయ్‌కుమార్ తనకు దొరికిన రూ.2.48 లక్షల నగదును పోలీసులకు అప్పగించి నిజాయతీ చాటుకున్నాడు. మంగళవారం బస్టాండ్ నుంచి ఇంటికి వెళ్తుండగా స్థానిక కోర్టువద్ద ఓ బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అనుకోకుండా నగదును కింద పడేసుకున్నాడు. గమనించిన విజయ్ పోలీసులను సంప్రదించి నగదు అప్పగించాడు. ఈ సందర్భంగా ఎస్పీ జానకీ షర్మిల విజయ్‌ను అభినందించారు.
రెండోరోజు కొనసాగిన కౌన్సెలింగ్
భైంసా: బాసర ట్రిపుల్‌ఐటీలో మంగళవారం రెండోరోజు కౌన్సెలింగ్ కొనసాగింది. క్రమసంఖ్య 565 నుంచి 1128 వరకు కౌన్సెలింగ్ నిర్వహించారు. రెండు రోజుల్లో 1,128 మందికిగానూ 989 మంది విద్యార్థులు హాజరయ్యారు. 139 మంది విద్యార్థులు రెండు రోజుల్లో కౌన్సెలింగ్‌కు హాజరు కాలేకపోయారు. గైర్హాజరైన విద్యార్థుల స్థానాలను త్వరలో వెకెంట్ లిస్టు ఆధారంగా భర్తీ చేస్తామని వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. కౌన్సెలింగ్ ప్రక్రియ బుధవారం కూడా కొనసాగనుంది.
మద్యం విక్రేతపై కేసు
ఆదిలాబాద్‌టౌన్: పట్టణంలోని శ్రీరామ్ కాలనీలో గల ఓ హోటల్‌లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న లంకాడే సత్యనారాయణపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. వైన్స్‌షాపు నుంచి మద్యం తీసుకొచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. స్థానికుల సమాచారం మేరకు తనిఖీ చేయగా పది మద్యం బాటిళ్లు లభించినట్లు వివరించారు.
ముగ్గురి రిమాండ్
సాత్నాల: భోరజ్ మండలంలోని పెండల్వాడలో భవునే రవి ఇంట్లో దేశీదారు విక్రయిస్తున్నారని సమాచారంతో మే 12న తనిఖీకి వెళ్లిన
ఎకై ్సజ్ ఎస్సై వైద్య వెంకటేశ్వర్, ఆరుగురు సిబ్బందిపై బావునే నమిత, బావునే మనీషా, బావునే సుమన్ భాయ్ దాడికి పాల్పడ్డారు. ఎకై ్సజ్ ఎస్సై వైద్య వెంకటేశ్వర్ ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఎస్సై గౌతమ్ పవర్ తెలిపారు.
పూసాయివాసికి డాక్టరేట్
పూసాయివాసికి డాక్టరేట్