
సబ్సిడీ ఎరువులు తరలిస్తున్న ఐదుగురిపై కేసు
ఆదిలాబాద్‌టౌన్: ప్రభుత్వం సబ్సిడీపై రైతులకు అందిస్తున్న ఎరువులను అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్న ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి తెలిపారు. రైతులు ఇచ్చిన సమాచారం మేరకు దాడి చేసి రెండు వాహనాలను జైనథ్ పోలీసులు మంగళవారం పట్టుకున్నట్లు పేర్కొన్నారు. బేల మండలం మార్క్‌ఫెడ్ అనుబంధ సంస్థ హైదరాబాద్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ అసోసియేషన్ (హాకా) ప్రొప్రైటర్ సునీల్, ఉద్యోగి అజయ్ మహారాష్ట్రకు చెందిన ఫర్టిలైజర్ దుకాణ యజమాని నిఖిల్‌తో ఒప్పందం కుదుర్చుకుని రూ.3 లక్షలు విలువ చేసే 150 బ్యాగుల యూరియాను రెండు వాహనాల్లో తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. వాహన డ్రైవర్లు వంకాడే దిలీప్, చిలకలవార్ చంద్రశేఖర్‌తో పాటు సునీల్, అజయ్, నిఖిల్‌పై కేసు నమోదు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో జైనథ్ సీఐ డి.సాయినాథ్, బేల ఎస్సై నాగ్‌నాథ్ పాల్గొన్నారు.