
ట్రాప్ కెమెరాల ఏర్పాటు
బోథ్: సొనాల మండలంలోని ఘన్‌పూర్ అడవుల్లో ఇటీవల ఓ ఆవును చంపిన గుర్తు తెలి యని జంతువును పులిగా భావిస్తున్నారు. అట వీ శాఖ అఽధికారులు సంబంధిత ప్రాంతానికి వెళ్లి పరిశీలించగా పులి పాదముద్రలు లభ్యం కాలేదు. అయితే ఇటీవల రఘునాథ్‌పూర్ అడవుల్లో పులి ట్రాప్ కెమెరాకు చిక్కడంతో అధి కారులు అప్రమత్తమై సోమవారం ఘన్‌పూర్ అడవుల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. కాగా ఆవును పులి చంపిందని ఎలాంటి ఆధారాలు లేవని ఎఫ్‌ఆర్‌వో ప్రణయ్ పేర్కొన్నారు.
రిటైర్డ్ సీఐ హఠాన్మరణం
ఆదిలాబాద్‌టౌన్: మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ రంగినేని మనిషా తండ్రి, రిటైర్డ్ సీఐ లచ్చన్న సోమవారం ఉదయం హఠన్మరణం చెందారు. 1980లో ఏఆర్ కానిస్టేబుల్‌గా పోలీసు శాఖలో చేరిన ఆయన 1999లో ఆదిలాబాద్‌రూరల్ పో లీసు స్టేషన్‌లో ఎస్సైగా, 2011లో వాంకిడి సీఐ గా బాధ్యతలు చేపట్టారు. 2014లో ఉద్యోగ విరమణ పొందారు. విషయం తెలుసుకున్న ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మృతదేహానికి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వేధింపులకు పాల్పడిన యువకులకు కౌన్సెలింగ్
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద పాఠశాల విద్యార్థినులను వేధింపులకు గురిచేస్తున్న ఇద్దరు యువకులకు షీటీం సభ్యులు స్వప్న, రజని, దినేశ్ సోమవారం పోలీస్ స్టేషన్‌లో కౌన్సెలింగ్ నిర్వహించారు. విద్యార్థినులు, మహిళలు వేధింపులకు గురైతే షీటీం నంబర్ 8712670564, లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అవగాహన
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం షీటీం ఆధ్వర్యంలో అవగా హన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవ్‌టీజింగ్, సోషల్ మీడియా వేధింపులు, మహిళల అక్రమ రవాణా, బాల్య వివాహాలు, బాల కార్మికులు, గుడ్‌టచ్, బ్యాడ్‌టచ్, సైబర్ క్రైమ్స్, మాదక ద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో షీ టీం సభ్యులు, ప్రిన్సిపాల్ రామ్‌దాస్ పాల్గొన్నారు.
పోస్టల్ సేవలకు కొత్త సాఫ్ట్‌వేర్
పాతమంచిర్యాల: వినియోగదారులకు వేగవంతమైన సేవలు అందించేందుకు పోస్టల్ శాఖలో కొత్త సాఫ్ట్‌వేర్ ఐటి 2.0 అప్లికేషన్ ప్రవేశపెడుతున్నట్లు అసిస్టెంట్ పోస్టల్ సూపరింటెండెంట్ ఆర్ రామారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 8 మంగళవారం నుంచి కొత్త సాఫ్ట్‌వేర్ సేవలు అందుబాటులోకి రానున్నాయని, దీంతో జిల్లా కేంద్రంలోని సార్టింగ్ (డిస్ట్రిబ్యూషన్) కార్యాలయంలో లావాదేవీలు జరగవన్నారు. పార్సిల్‌లు, ఉత్తరాలు సార్టింగ్ కార్యాలయం నుంచి బట్వాడా కావన్నారు.