
మలేరియా కేసులపై ఆరా
మంచిర్యాలటౌన్: మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వచ్చిన మహారాష్ట్రలోని సిరొంచ, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరికి మలేరియా సోకినట్లుగా వైద్యులు నిర్దారించారు. మంచిర్యాల ఉపవైద్యాధికారి డాక్టర్ అనిత సోమవారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని జ్వరాల వార్డులో చికిత్స పొందుతున్న ఇద్దరు రోగులతో మాట్లాడి వివరాలను సేకరించారు. జిల్లాలో మలేరియా కేసులు నమోదు కాలేదని, ఇతర జిల్లాల నుంచి మంచిర్యాలకు వచ్చి చికిత్స పొందుతున్నారని ఆమె పేర్కొన్నారు.
పకడ్బందీగా పరీక్షలు
మంచిర్యాలఅర్బన్: డీసీఈబీ ఆధ్వర్యంలో పరీక్షలు, కార్యక్రమాలు పకడ్బందీగా అమలు చేయాలని డీఈవో యాదయ్య సూచించారు. సోమవారం డీసీఈబీ కార్యాలయంలో 2025–26 విద్యాసంవత్సరంలో ఉమ్మడి పరీక్షల నిర్వహణ బోర్డు మొదటి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరి అభిప్రాయాలు తీసుకుని వాటికి అనుగుణంగా వర్క్‌షాప్‌లు నిర్వహించడం, ఎలాంటి తప్పులు లేకుండా పరీక్ష ప్రశ్నపత్రాలు రూపొందించడం, నాణ్యమైన ప్రశ్న పత్రాలు ముద్రితం, సమ్మెటివ్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. సమావేశంలో డీసీఈబీ సెక్రెటరీ మహేశ్వర్‌రెడ్డి, అసిస్టెంట్ సెక్రెటరీ వేణుమాధవ్, జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ సత్యనారాయణమూర్తి, డీఎస్‌వో మధుబాబు, ఎంఈవో, కాంప్లెక్ ప్రధానోపాధ్యాయులు, ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధులు పాల్గొన్నారు.
బెల్లం, పటిక పట్టివేత
ఖానాపూర్: ఖానాపూర్ నుంచి బీర్నందికి ఆటోలో అక్రమంగా పటిక, బెల్లం తరలిస్తున్న కే.రాజ్‌కుమార్‌ను సోమవారం అరెస్టు చేశామని ఎకై ్సజ్ ఎస్సైలు అభిషేకర్, వసంత్‌రావు తెలిపారు. నిందితుని వద్ద నుంచి ఆటోతో పాటు 110 కిలోల బెల్లం, 20 కిలోల పటికను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో సిబ్బంది వెంకటేశ్, హరీశ్, నరేందర్ పాల్గొన్నారు.

మలేరియా కేసులపై ఆరా