
‘మత్తడివాగు’ రెండు గేట్లు ఎత్తివేత
ఇటీవల కురుస్తున్న వర్షాలకు మత్తడివాగు ప్రాజెక్టుకు భారీగా వరదనీరు రావడంతో నిండుకుండలా మారింది. ఇన్‌ఫ్లో ద్వారా 697 క్యూసెక్కుల వరదనీరు రాగా అధికారులు ముందు జాగ్రత్తగా ఆదివారం రాత్రి రెండు గేట్లను ఎత్తి 604 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 277.5 మీటర్లు కాగా ప్రస్తుతం 276.30 మీటర్ల వద్ద నీరు నిల్వ ఉన్నట్లు ఏఈ హరీష్ కుమార్ తెలిపారు. – తాంసి
గేట్లను ఎత్తడంతో దిగువకు వెళ్తున్న నీరు