
మత్స్యకారుల సొసైటీల్లో నగదు జమ చేయాలి
పాతమంచిర్యాల: తెలంగాణ మత్స్యకారుల సొసైటీలలో చేప, రొయ్య పిల్లల కొనుగోలు కోసం ప్రభుత్వం నగదు జమ చేయాలని తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం సొసైటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని చార్వాక భవన్‌లో మత్స్యకారుల జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం చేప, రొయ్య పిల్లల పంపిణీపై నిర్ధిష్టమైన ప్రకటన చేయకపోవడంలో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారన్నారు. చేప, రొయ్య పిల్లల కొనుగోలు కోసం ఎలాంటి టెండర్లు లేకుండా నగదు జమ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎన్‌సీడీసీ, ఎన్‌ఎఫ్‌డీబీ నిధులను ఎత్తివేయడాన్ని నిరసిస్తూ మత్స్యకారులు జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెలో భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బోడెంకి చందు, నాయకులు బోడెంకి మహేష్, కంపల చంద్రయ్య, పిట్టల దశరథం, మంచర్ల రాజేందర్, జిల్లాల శ్రీనివాస్, జనుగరి నారాయణ, డోకే సమ్మయ్య, నాగుల మహేష్, బోగుట వెంకటేష్, రైతు సంఘం అధ్యక్షుడు సంకె రవి, తదితరులు పాల్గొన్నారు.