
పీరీల ఊరేగింపు
మంచిర్యాలఅర్బన్/నస్పూర్: మంచిర్యాల, నస్పూర్ పట్టణాల్లో సోమవారం మొహర్రం వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ముఖరాం చౌరస్తా, మసీద్‌వాడ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పీరీలకు దట్టీలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులతో సందడిగా కనిపించాయి. హస్సేన్, హుస్సేన్‌లను కొలుస్తూ వారి త్యాగాలను స్మరించారు. ఉపవాస దీక్షలతో పీరీలను ఊరేగించారు. కుల, మతాలకతీతంగా ప్రజలు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం వేళల్లో పీరీల గుండం వద్ద డప్పుల చప్పుళ్లతో పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. అసైదులా ఆటలతో పురవీధుల్లో మోహర్రం వేడుకలు అంబరాన్నంటాయి. చిన్నారులు, మహిళలు కుడుకల దండలు, చక్కెర గుళికల పేర్లతోపాటు దస్తీ(ఖర్చీఫ్)లను పీరీలకు కట్టారు. అనంతరం స్థానిక చెరువు, వాగుల్లో నిమజ్జనం చేశారు. ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. నస్పూర్‌లో నిర్వాహకులు మాలిక్ కృష్ణరెడ్డి, శివారెడ్డి, కిరణ్, లింగమూర్తి, లచ్చన్న, చందు పాల్గొన్నారు,

పీరీల ఊరేగింపు